ఆశీర్వదించు నాన్నా, మీ ఆనందం కోసం అబద్ధం చెప్తున్న నాకు నిన్ను సంతోషపెట్టే నిజం చెప్పే సందర్భం కావాలి, మీ కలల్ని నా కళ్ళతో కని నిజం చేయగలిగే సామర్థ్యం కావాలి, ఆనందంగా ఉన్న మీ కళ్ళల్లోకి చూసి నా గుండె సంతోషంతో నిండిపోయి కళ్ళనించి పొంగిపోవాలి, మనందరి సంతోషం కోసం కష్టపడి అలసిపోయినప్పుడు నీ కళ్ళల్లో కనబడే సంతోషాన్ని అనుభవించే అవకాశం నాకు కలగాలి, నీ అభిప్రాయాలతో విభేదించేంత ధైర్యం నాకు కలగాలి, మా భాద్యతల్ని మోస్తున్న భుజాలకి విరామం రావాలి, నీ మనవళ్ళు మనవరాళ్ళ వినోదానికి అవి కారణమవ్వాలి, సంతోషంలో ఉన్న మనల్ని పలకరించే కష్టాలని నేను ఎదుర్కోగలననే నమ్మకం మీకు కలగాలి, ఆ భవిష్యత్తు కోసమే నా ప్రస్తుత ప్రయత్నం, ఆ ఆనందం కోసమే నా నిరంతర తాపత్రయం..!!