Skip to main content

Posts

Showing posts from 2023

నీ జ్ఞాపకాలు

 మర్చిపోగలనా నీ కోసం నేను పడ్డ తపన, గుర్తుచేసుకోకుండా ఉండగలనా నువ్వు నాతో లేవనే ఆలోచన..!! కాలక్షేపం అనుకున్నావో, కాలయాపన అనుకున్నవో, మన బంధాన్ని గతానికి వదిలేసి, సముద్రాలు దాటి గాలిలో వెళ్ళిపోయావు, నన్ను నీ జ్ఞాపకాల సముద్రంలో వదిలేసిపోయావు..!! ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకుంటుంటే పిచ్చి పట్టిందనుకున్నారు, కన్నీళ్ళు ఇంకిపోయి నవ్వుతుంటే పిచ్చి ముదిరిందనుకున్నారు, కన్నీళ్ళు ఇంకిపోయాక తెలిసింది నువ్విక రావని, కన్నీళ్ళతో పాటు నీ మీదున్న ప్రేమ వదిలిపోలేదని..!! నీతోనే జీవితం అని నేననుకున్నా, నేను లేకుంటేనే జీవితం అని నువ్వనుకున్నావు..!! నాది నువ్వు తప్ప వేరే ఆలోచన లేని ప్రేమ, నీది నాతో భవిష్యత్తుని ఊహించుకుని వదిలేసిన ప్రేమ..!! నన్ను వదిలేసిపోయిన నీది తప్పు కాదు, నీ ఆలోచనల్ని వదులుకోలేని నాదే తప్పు..!! - మీ సత్య

మోసం

 మోసం, చేసేవాడికి అవసరంతో ఏర్పడిన అలవాటు, మోసపోయేవాడికి మంచితనం వల్ల జరిగే పొరపాటు..!! మోసం, చేసేవాడిది అవసరం, పోయేవాడికి ఒక పాఠం..!! మోసం, మళ్ళీ చేస్తే అది వాడి తత్వం, మళ్ళీ మోసపోతే అది మన అమాయకత్వం..!! మోసం, ఒక అవకాశం, చేసిన వాడు మారడానికి, పోయిన వాడు జాగ్రత్తపడటానికి..!! మోసం, మనల్ని మనం చేసుకుంటే మన చేతకానితనం, మనల్ని వేరొకడు చేస్తే వాడి గొప్పతనం..!! మోసం, మంచోడైతే జాగ్రత్తపడతాడు, మనిషైతే స్వార్థపరుడవుతాడు, పిచ్చోడైతే నవ్వుకుని ఊరుకుంటాడు..!!  మోసం, చేసినవాడికి వాడి ప్రయాణంలో మరో గెలుపు, మోసపోయిన వాడికి మాత్రం జీవితంలో ఓ మలుపు..!! - మీ సత్య