Skip to main content

Posts

Showing posts from 2020

నాతో నేను రోజూ చెప్పుకునే మాటలు.

 కాలం నిన్ను దాటిపోతుంది, నువ్వు కన్న కలలు నిన్నొదిలి పోతున్నాయి. ఆశలు పెరిగిపోతున్నాయి, ఆనందం తరిగిపోతుంది. గెలుపు గేళి చేస్తుంటే ఓటమి ఓదారుస్తుంది. ఏ గెలుపు లేకపోయినా గర్వం మాత్రం తగ్గడం లేదు. అన్ని జరిగిపోతున్నాయని అహంకారమా? ఏమీ లేకపోతే ఏమైపోతావో అనే భయం కలిగే రోజు కూడా వస్తుందని గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకుంటే సరిపోదు, గుర్తు చేసుకుంటూ ఉండు.  ఎవరికోసమూ వేచి ఉండని కాలాన్ని నువ్వు వృథా చేసుకుంటున్నవు. అర్థం లేని ఆనందాల కోసం అందమైన భవిష్యత్తుని కోల్పోతావా? కదిలి రాలేవా కలలు నిజం చేసుకోడానికి? కలిసి ఉండలేకపోతున్నావా కష్టంతో, ఇష్టమైనది సాధించుకోడానికి? ఇష్టపడలేకపోతున్నావా కష్టాన్ని, శాశ్వతమనుకుంటున్నావా ఈ స్వార్థపు సుఖాన్ని? నేర్చుకోలేకపోతున్నావా కాలం నేర్పే పాఠాలను? ప్రయత్నించకుండా కొత్తగా సాధించేది ఏం లేదు, పాతపాఠాలను మళ్ళీ పలకరించడం తప్ప. ప్రయత్నించు, విఫలమవ్వు, విజయం సాధించు. విఫలమవ్వుతున్నావని విసుగుచెందకు, విఫలమవుతున్నా విసుగు చెందకుండా ప్రయత్నించడమే విజయమని గుర్తించుకో. కొత్తగా ప్రయత్నించలేకపోవడానికి భయమా, పాతవాటిని వదులుకోని బద్ధకమా?  కలగన్న దానికోసం కాలంతో పోటీపడుతూ ప్రయత్నిం

ఎవర్ని నమ్మాలి?

                                   ఎవ్వరినీ నమ్మొద్దు. నిన్ను నువ్వు నమ్ముకో, నువ్వు నమ్మిన దారిలో మొదటి అడుగు నీదే కావాలి. ఆ దారిలో నీతో పాటు ఎన్నో అడుగులు కలవొచ్చు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవచ్చు, లేదా నువ్వొక్కడివే ఒంటరిగా మిగిలిపోవచ్చు. ఎవర్ని నమ్మలేము. మన జీవితమే మనకి రోజూ ఎన్నో పరీక్షలని పెడుతుంది. అలాంటిది మనతో, మనం నమ్మిన మార్గంలో నడిచే వారి నిజాయితీని, నిబద్ధతని తెలుసుకోవడానికి నువ్వు ఎన్ని పరీక్షలు పెట్టాలి? అన్ని పరీక్షల్లో నెగ్గినా ఆఖరి అడుగు దాకా నీతో కలిసి నడుస్తాడన్న నమ్మకం కలుగుతుందా? నాకైతే కలగదు, నేటి పరిస్థితులని చూసి అస్సలు నమ్మాలంటేనే భయమేస్తుంది. కానీ నమ్మక తప్పదు. నమ్మకంతో సాగాల్సిన ప్రయాణం మనందరి జీవితం. మనం అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఒక్క కాలమే చెప్పగలదు. వేచి చూడడం, అంతవరకూ నమ్మడమే మనం చేయగలం.                                     అయినా ఎవడో మనల్ని నమ్మించి మోసం చేశాడని భాధపడిపోయి మన ప్రయాణాన్ని ఆపేస్తామా? ఆపేయ్యకూడదు. మనం చేసే పని మీద మనకు నమ్మకం ఉండాలి, మనం చేసే పనిని, ఎంచుకున్న మార్గాన్ని చూసి మన చూట్టూ ఉన్న నలుగురిలో మన మీద నమ్మకం కలగాలి. ఇక్కడ చెడ్డగా మారె

నేను థియేటర్ లో చూసిన మొదటి హాలీవుడ్ సినిమా

అది 2004 సంవత్సరం.మా క్లాస్ టీచర్ అందరినీ 5 రూపాయలు తెచ్చుకోమంది. కానీ ఎందుకు అనేది చెప్పలేదు. మేము తలా ఒక కారణం అనుకుంటున్నాము. ఒకడు ఏదో పుస్తకం కోసం అంటే, ఇంకొకరు ఎవరికో డోనేషన్ ఇవ్వడానికి అని అలా రకరకాలుగా ఉహించేసుకున్నాం. ఇంట్లో నాన్నని అడిగితే 5 రూపాయల నోటు చేతిలో పెట్టి, అదనంగా ఇంకో 2 రూపాయలు ఇచ్చాడు. ఇంకేముంది రెట్టింపు ఆనందంతో స్కూలు బస్సెక్కి స్కూలు కి వెళ్ళాను. అంతా మామూలుగానే జరుగుతుంది. ఇంతలో 10 గంటలు అవుతుంది అనగా ఒక సార్ వచ్చి అందరినీ లైన్ లో రమ్మన్నారు. ఆయన చెప్పగానే పుస్తకాలు ఎక్కడివక్కడే వదిలేసి వెళ్లిపోయాం. వచ్చిన సార్ మమ్మల్ని బస్ ఎక్కమన్నాడు. ఎక్కగానే పక్క బస్సులో ఉన్న సీనియర్ లీక్ చేసాడు మనల్ని సినిమాకి తీసుకెళ్తున్నారురా అని. ఇంకేముంది సినిమా అనే ఆలోచనకే మా అందరి ఆనందానికి అవధుల్లేవు. మాలో ఎక్కువమంది చిరంజీవి సినిమాకే అనుకుంటున్నాము. థియేటర్ కి వెళ్ళేదాక మాకు తెలియని విషయం ఏమిటంటే మేము వెళ్ళేది తెలుగులోకి డబ్బింగ్ అయిన ఇంగ్లీష్ సినిమాకి అని. కొంచెం నిరాశపడినా తర్వాత స్నేహితులందరితో సినిమా అనే సంతోషంలో ఆ నిరాశ ఎంతోసేపు ఉండలేదు. సినిమా మొదలైంది. మేమందరం నోర్లు వెళ్ళ

రెండవ వ్యాసం

                                     మనిషిగా పుట్టినందుకు, సమాజంలో ఒకడిగా ఆ సమాజపు నియమాలకు లోబడై జీవించడం అనేది తప్పనసరి అయిన విషయం. కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాల్సినవి కాబట్టి పాటిస్తాం, మరికొన్ని మనకు తెలియకుండానే అందరూ పాటిస్తున్నారని అనుసరించేస్తాం. ప్రతి ఒక్కరికి జీవితంలో చాలా సందర్భాల్లో కుటుంబం చేయలేని సాయం అవసరం అవుతుంది. ఆ సాయం సమాజం నుండి నువ్వు పొందాలంటే మనం కూడా సమాజంలో భాగమే అని ఆ సమాజంలో ఉన్నవారందరికీ ఎప్పుడూ, లేదా కనీసం అప్పుడప్పుడు అయినా గుర్తు చేస్తూ ఉండాలి.                                        తమకి నచ్చకపోయినా సమాజానికి నచ్చినట్లుగా జీవించలేక నటిస్తూ నలిగిపోయేవారు ఎంతోమంది. కనీసం సమాజంతో అవసరం లేకుండా, తనకు నచ్చినట్లు బ్రతికే స్థాయికి సమయం పడుతుంది. ఆ సమయంలో అయినా నటించక తప్పదు. అందరూ ఆ బంధనాల నుండి తప్పించుకోవాలని జీవితంలో పోరాడేవారే. అయితే కొంతమందికి కుటుంబరీత్యానో, పరిస్థితుల దృష్ట్యానో కష్టపడడం అలవాటు అయి తొందరగా సమాజాన్ని శాసించే స్థాయికి ఎదుగుతారు. కొంతమందికి ఆ స్థాయికి ఎదగాలని ఉన్నా, పరిస్థితుల ప్రభావం వలనో సరైన ప్రయత్నం లేకపోవడం వలనో అనుకున్న స్థాయ

అవినీతి

అవినీతి, మన ప్రజల రోజువారీ జీవితాల్లో అది కూడా భాగమైపోయింది. మరీ పుస్తకంలో రాసింది రాసినట్లు ప్రతిదానిని అనుసరించడానికి ఎవరికీ సాధ్యం కావడం లేదు. సామాన్యుడికి సమయం లేదు, అధికారుల ఆశకి అంతు లేదు. ఈ రెండింటిని తృప్తి పరిచేది ఒక్క అవినీతి మాత్రమే. అన్ని సక్రమంగా ఉన్నా ఎంతో కొంత ముట్టజెప్పాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఎంతో ప్రయాస పడి అన్ని సక్రమంగా చేయాలేనే భావన సగటు సామాన్యుడిలో కూడా ఉంది. పోనీ అవినీతిని ఎదిరించి పని చేసుకుందామంటే పని జరగదు. ఫిర్యాదు చేసినా సత్వరంగా న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు.  వీటన్నింటి వలన అవినీతి అనేది అన్ని చోట్లా పెరిగిపోతుంది. ఒకరిద్దరు నీతిగా పనిచేస్తున్నా ఆ ఒకరిద్దరంటే మిగిలిన అధికారులకి భయం పెరిగిపోయి, మిగిలిన వారందరూ వారికి వ్యతిరేకం అయిపోయి పని చేయడం కష్టతరం చేసేస్తారు. ఇలా కష్టాలు ఎదురైనప్పుడు తమ ముందుండేవి రెండే దారులు. ఒకటి తాము నమ్ముకున్న సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేయలేక ఉద్యోగం మానేయడం, లేదా నచ్చకపోయినా సిద్ధాంతాలను పక్కనబెట్టి అవినీతి మార్గాన్ని ఎంచుకోవడం. మొదటిది అందరూ చేయలేరు. తన మీద ఆధారపడి ఉన్న కుటుంబాన్ని పోషించాల్సిన భాద్యత వారిపై ఉంటుంది. ఈ