Skip to main content

Posts

నీ జ్ఞాపకాలు

 మర్చిపోగలనా నీ కోసం నేను పడ్డ తపన, గుర్తుచేసుకోకుండా ఉండగలనా నువ్వు నాతో లేవనే ఆలోచన..!! కాలక్షేపం అనుకున్నావో, కాలయాపన అనుకున్నవో, మన బంధాన్ని గతానికి వదిలేసి, సముద్రాలు దాటి గాలిలో వెళ్ళిపోయావు, నన్ను నీ జ్ఞాపకాల సముద్రంలో వదిలేసిపోయావు..!! ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకుంటుంటే పిచ్చి పట్టిందనుకున్నారు, కన్నీళ్ళు ఇంకిపోయి నవ్వుతుంటే పిచ్చి ముదిరిందనుకున్నారు, కన్నీళ్ళు ఇంకిపోయాక తెలిసింది నువ్విక రావని, కన్నీళ్ళతో పాటు నీ మీదున్న ప్రేమ వదిలిపోలేదని..!! నీతోనే జీవితం అని నేననుకున్నా, నేను లేకుంటేనే జీవితం అని నువ్వనుకున్నావు..!! నాది నువ్వు తప్ప వేరే ఆలోచన లేని ప్రేమ, నీది నాతో భవిష్యత్తుని ఊహించుకుని వదిలేసిన ప్రేమ..!! నన్ను వదిలేసిపోయిన నీది తప్పు కాదు, నీ ఆలోచనల్ని వదులుకోలేని నాదే తప్పు..!! - మీ సత్య
Recent posts

మోసం

 మోసం, చేసేవాడికి అవసరంతో ఏర్పడిన అలవాటు, మోసపోయేవాడికి మంచితనం వల్ల జరిగే పొరపాటు..!! మోసం, చేసేవాడిది అవసరం, పోయేవాడికి ఒక పాఠం..!! మోసం, మళ్ళీ చేస్తే అది వాడి తత్వం, మళ్ళీ మోసపోతే అది మన అమాయకత్వం..!! మోసం, ఒక అవకాశం, చేసిన వాడు మారడానికి, పోయిన వాడు జాగ్రత్తపడటానికి..!! మోసం, మనల్ని మనం చేసుకుంటే మన చేతకానితనం, మనల్ని వేరొకడు చేస్తే వాడి గొప్పతనం..!! మోసం, మంచోడైతే జాగ్రత్తపడతాడు, మనిషైతే స్వార్థపరుడవుతాడు, పిచ్చోడైతే నవ్వుకుని ఊరుకుంటాడు..!!  మోసం, చేసినవాడికి వాడి ప్రయాణంలో మరో గెలుపు, మోసపోయిన వాడికి మాత్రం జీవితంలో ఓ మలుపు..!! - మీ సత్య 

ఆశీర్వదించు నాన్నా!!

ఆశీర్వదించు నాన్నా, మీ ఆనందం కోసం అబద్ధం చెప్తున్న నాకు నిన్ను సంతోషపెట్టే నిజం చెప్పే సందర్భం కావాలి, మీ కలల్ని నా కళ్ళతో కని నిజం చేయగలిగే సామర్థ్యం కావాలి, ఆనందంగా ఉన్న మీ కళ్ళల్లోకి చూసి నా గుండె సంతోషంతో నిండిపోయి కళ్ళనించి పొంగిపోవాలి, మనందరి సంతోషం కోసం కష్టపడి అలసిపోయినప్పుడు నీ కళ్ళల్లో కనబడే సంతోషాన్ని అనుభవించే అవకాశం నాకు కలగాలి, నీ అభిప్రాయాలతో విభేదించేంత ధైర్యం నాకు కలగాలి, మా భాద్యతల్ని మోస్తున్న భుజాలకి విరామం రావాలి, నీ మనవళ్ళు మనవరాళ్ళ వినోదానికి అవి కారణమవ్వాలి, సంతోషంలో ఉన్న మనల్ని పలకరించే కష్టాలని నేను ఎదుర్కోగలననే నమ్మకం మీకు కలగాలి, ఆ భవిష్యత్తు కోసమే నా ప్రస్తుత ప్రయత్నం, ఆ ఆనందం కోసమే నా నిరంతర తాపత్రయం..!!

నా ఆవేదన..!!

మంచి ఎదగడానికి, చెడుని తుంచడానికి, తోడ్పడలేకపోతున్నాననే ఆవేదన..!! అనుమానం కలిగినా, అవమానం అనే భయంతో, మూసధోరణిలోనే పయనిస్తున్నాని ఆవేదన..!!  ప్రయత్నించకుండానే పరాజయానికి, గెలవకుండానే భాద్యతల భారానికి, భయపడిపోతున్నానని ఆవేదన..!! నా కోసం కష్టపడిన వాళ్ళకి, నన్ను ఇష్టపడుతున్న వాళ్ళకి, ఇద్దరికీ ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నానని ఆవేదన..!! చేసేది తప్పని తెలిసినా, తప్పక చేస్తున్న తప్పని సర్దుకుపోతున్నందుకు ఆవేదన..!! నా మీద నాకున్న అనుమానంతో, సమాజం మీదున్న భయంతో, మంచికి తోడుగా నిలబడలకేపోతున్నాని ఆవేదన..!! - సత్య

ఓ రోజు కావాలి

ఓ రోజు కావాలి, నిన్నటి గురించి భాధపడలేనిది, రేపటి గురించి భయపడలేనిది..!! ఓ రోజు కావాలి, అనుకున్నది చేసేందుకు, చేసినందుకు ఆనందించేందుకు..!! ఓ రోజు కావాలి, మర్చిపోలేని స్ఫూర్తి కొరకు, మరువలేని ఆశయం కొరకు..!! ఓ రోజు కావాలి, నన్ను నేను ప్రేమించేందుకు, నన్ను ప్రేమించేవాళ్ళని గుర్తించేందుకు..!! ఓ రోజు కావాలి, కష్టాన్ని ఇష్టపడేందుకు, కష్టపెట్టే ఇష్టాన్ని ఇడిసెందుకు..!! ఓ రోజు కావాలి, మనసారా నవ్వటానికి..!! ఓ రోజు కావాలి, వదిలిపోని సంతోషాలకి, తిరిగిరాని భయానికి..!!

నేను, నా ఆలోచనలు

 కాలానికి నా కష్టం పట్టదు, అదృష్టానికి నా అవసరం ఉండదు..!! సంతోషం కోసం సర్దుకోగలం కానీ, కష్టపడానికి ఇష్టపడలేని మనుషులం..!! కష్టానికి మాత్రమే విలువుంటే కర్షకుడికి ఇన్ని కష్టాలెందుకో, కొన్నిసార్లు కష్టానికి అదృష్టం తోడు కూడా కావాలేమో..!! ఉషోదయం ఎరుగని బ్రతుకైపోతుంది నాది, గది దాటి కదలలేని కలలైపోతున్నాయి నావి..!! కోరుకున్నది దరిచేరనందుకు కాలాన్ని నిందిస్తున్నాను, కోరుకున్నదాని గురించి కవిత్వం రాసి సంబరపడిపోతున్నాను..!! నా కలలు నన్ను బ్రతికించే ఊపిర్లు అయితే, కష్టపడలేక నేను చెప్పుకునే కారణాలు నాకున్న రోగాలు..!! నన్ను నిత్యం నిందించేది నా మనసు, నేను నిందించడానికే దొరికింది నాకు వెళ్లిపోయిన వయసు..!! నా మనసులోని ఆలోచనలకి అంతం లేనట్లే, నా అలోచనల్లోని ప్రశ్నలకి సమాధానం లేదు..!! సమాధానం వెతకలేని అజ్ఞానిని కాదు కానీ, సంజాయిషీ కోసం వెతుక్కుంటూ బ్రతికేస్తున్న మూర్ఖుడ్ని..!! - సత్య

నేను రాసుకున్న ప్రేమలేఖ

నువ్వు రాకముందు చేశా ఒంటరితనానికి బానిసత్వం, నువ్వు వచ్చాక సాధించా నీ ప్రేమకే పోరాడాలనే స్వాతంత్రం..!! మర్చిపోవాలనుకుంటున్నాను నువ్వు లేని నా గతం, అందంగా మలుచుకోవాలనుకుంటున్నను ఇకపై నాతో నీ జీవితం..!! నీ ప్రేమకై నేను చేసే పోరాటం, నన్నే నాకు కొత్తగా చేసింది పరిచయం..!! నీవు తోడుగా ఉండాలని నేను పడే ఆరాటం, నా జీవితానికి ఉందని తెలిసేలా చేసింది ఓ అర్థం..!! ప్రేమని నమ్మని నేను నీ పరిచయంలోని అధ్భుతాన్ని నమ్ముతాను, అధ్భుతమంటే తెలియని నేను నీ ప్రేమ రూపంలో ఆస్వాదించాను..!! విజయాన్ని దగ్గరగా చూస్తూ ఉన్నా, నీ నుండి దూరాన్ని మాత్రం భరించలేకున్నా..!! నీ ప్రేమని అర్థం చేసుకోడానికి పెద్ద పెద్ద పుస్తకాలు చదివే అవసరం రాలేదు కానీ, నాకు నీ మీదున్న ఒక పెద్ద పుస్తకమంత ప్రేమని ఒక లేఖలో వివరించడానికి మాత్రం అవస్థలు పడుతున్నా..!! నేను జీవితంలో పరిగెడితే అది నీ కోసం, అలసిపోయి ఆగిపోయినప్పుడు కోరుకునేది నీ సాన్నిహిత్యం..!! నా జీవితానికి అర్థం తెలిపిన నువ్వంటే నాకిష్టం, నన్ను నాకు కొత్తగా పరిచయం చేసిన నీ ప్రేమంటే గౌరవం..!! - సత్య