Skip to main content

Posts

Showing posts from July, 2020

రెండవ వ్యాసం

                                     మనిషిగా పుట్టినందుకు, సమాజంలో ఒకడిగా ఆ సమాజపు నియమాలకు లోబడై జీవించడం అనేది తప్పనసరి అయిన విషయం. కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాల్సినవి కాబట్టి పాటిస్తాం, మరికొన్ని మనకు తెలియకుండానే అందరూ పాటిస్తున్నారని అనుసరించేస్తాం. ప్రతి ఒక్కరికి జీవితంలో చాలా సందర్భాల్లో కుటుంబం చేయలేని సాయం అవసరం అవుతుంది. ఆ సాయం సమాజం నుండి నువ్వు పొందాలంటే మనం కూడా సమాజంలో భాగమే అని ఆ సమాజంలో ఉన్నవారందరికీ ఎప్పుడూ, లేదా కనీసం అప్పుడప్పుడు అయినా గుర్తు చేస్తూ ఉండాలి.                                        తమకి నచ్చకపోయినా సమాజానికి నచ్చినట్లుగా జీవించలేక నటిస్తూ నలిగిపోయేవారు ఎంతోమంది. కనీసం సమాజంతో అవసరం లేకుండా, తనకు నచ్చినట్లు బ్రతికే స్థాయికి సమయం పడుతుంది. ఆ సమయంలో అయినా నటించక తప్పదు. అందరూ ఆ బంధనాల నుండి తప్పించుకోవాలని జీవితంలో పోరాడేవారే. అయితే కొంతమందికి కుటుంబరీత్యానో, పరిస్థితుల దృష్ట్యానో కష్టపడడం అలవాటు అయి తొందరగా సమాజాన్ని శాసించే స్థాయికి ఎదుగుతారు. కొంతమందికి ఆ స్థాయికి ఎదగాలని ఉన్నా, పరిస్థితుల ప్రభావం వలనో సరైన ప్రయత్నం లేకపోవడం వలనో అనుకున్న స్థాయ

అవినీతి

అవినీతి, మన ప్రజల రోజువారీ జీవితాల్లో అది కూడా భాగమైపోయింది. మరీ పుస్తకంలో రాసింది రాసినట్లు ప్రతిదానిని అనుసరించడానికి ఎవరికీ సాధ్యం కావడం లేదు. సామాన్యుడికి సమయం లేదు, అధికారుల ఆశకి అంతు లేదు. ఈ రెండింటిని తృప్తి పరిచేది ఒక్క అవినీతి మాత్రమే. అన్ని సక్రమంగా ఉన్నా ఎంతో కొంత ముట్టజెప్పాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఎంతో ప్రయాస పడి అన్ని సక్రమంగా చేయాలేనే భావన సగటు సామాన్యుడిలో కూడా ఉంది. పోనీ అవినీతిని ఎదిరించి పని చేసుకుందామంటే పని జరగదు. ఫిర్యాదు చేసినా సత్వరంగా న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు.  వీటన్నింటి వలన అవినీతి అనేది అన్ని చోట్లా పెరిగిపోతుంది. ఒకరిద్దరు నీతిగా పనిచేస్తున్నా ఆ ఒకరిద్దరంటే మిగిలిన అధికారులకి భయం పెరిగిపోయి, మిగిలిన వారందరూ వారికి వ్యతిరేకం అయిపోయి పని చేయడం కష్టతరం చేసేస్తారు. ఇలా కష్టాలు ఎదురైనప్పుడు తమ ముందుండేవి రెండే దారులు. ఒకటి తాము నమ్ముకున్న సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేయలేక ఉద్యోగం మానేయడం, లేదా నచ్చకపోయినా సిద్ధాంతాలను పక్కనబెట్టి అవినీతి మార్గాన్ని ఎంచుకోవడం. మొదటిది అందరూ చేయలేరు. తన మీద ఆధారపడి ఉన్న కుటుంబాన్ని పోషించాల్సిన భాద్యత వారిపై ఉంటుంది. ఈ