Skip to main content

ఎవరం మనం

 ఎవరం మనం,

మనసుల్ని మభ్యపెట్టుకుంటూ బ్రతుకుతున్న మనుషులం,

భయం లేదంటూ ధైర్యంగా బ్రతికేస్తున్న బానిసలం,

అర్థంలేని ఆవేశాలతో అనుక్షణం ఊగిపోతున్న యువకులం,

బద్ధకానికి అలవాటుపడిపోయిన భావిభారత పౌరులం,

ఆలోచనల దగ్గరే ఆగిపోతున్న అభినవ అంబేద్కర్లం,

వొల్లు కదలకుండా విజయాన్ని కోరుకుంటున్న విప్లవవీరులం,

సాటి మనిషిలోని మంచిని చూడటానికి ఆలోచించే అమాయకులం,

మంచిది కాకపోయినా మందితో పోతున్న మంచి మనుషులం,

మారాలంటూనే సమాజం, మనకెందుకులే అనుకునే మూర్ఖులం,

కలలు కన్న సమాజం కోసం కష్టపడలేని కష్టజీవులం,

కష్టాలని చూసి కంగారుపడిపోయి కలలని వదిలేసుకునే త్యాగజీవులం,

వేరొకరి గురించి వారి వెనుక చెడు మాట్లాడకుండా ఉండలేని సౌమ్యులం,

సామర్థ్యం ఉన్నా సాయం చేయడానికి సంకోచించే సామాన్యులం..!!


                                                                                                                            - సత్య    

Comments

  1. సత్య గారు...🙌🏻👌🏻

    ReplyDelete
  2. Single line లో bunch of thoughts pettagalige మీ pen కి, aalochanani kadhilinchela మీ pen ని kadhilinche బుద్ధికి🙏🙏

    Always fan of penned Satya ❤️

    ReplyDelete
  3. సూపర్ తమ్ముడూ👌

    ReplyDelete
  4. భావం అద్భుతంగా వుందండీ.

    ఏమీ అనుకోకపోతే
    వొల్లు కంటే "వళ్ళు" లేదా "వొళ్ళు" అంటే బావుంటుందేమో చూడండి.

    WDTC

    ReplyDelete
    Replies
    1. ఒళ్ళు అని పెడితే ఈ ఫాంట్ లో సరిగ్గా రావడం లేదండి, అందుకే అలా రాసాను..

      Delete
  5. అన్నిటికన్నా సామర్థ్యం ఉన్న సహాయం చేయడానికి ఆలోచించే / సంకోచించే సామాన్యులు. 👌

    ReplyDelete
  6. వేరొకరి గురించి వారి వెనుక చెడు మాట్లాడకుండా ఉండలేని సౌమ్యులం,

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

నిద్రలేని రాత్రుల్లో కలిగిన ఆలోచనలు.

ఏ కాలంలో అయినా కష్టానికి సరైన గుర్తింపు ఉంటుందో లేదో తెలియదు కానీ, విజయానికి మాత్రం మంచి విలువ ఉంటుంది..!! కష్టాన్ని గుర్తించలేని సమాజంలో విజయంతోనే విలువ కట్టే సమాజంలో కన్నీళ్ళకి విలువ ఉండదు..!! అవినీతికి అలవాటు పడిపోయిన ప్రజలు, ఆరోపణలున్న రాజకీయనాయకులని మాత్రం వదులుకుంటారా?? మంచిని అర్థం చేసుకోలేని ప్రజలు, అర్థంచేసుకోడానికి ఆలోచించాల్సిన మంచిని అక్కున చేర్చుకోగలరా?? బలమైన ఆలోచనల్లోంచే పుట్టిన అభిప్రాయాలే, బలహీనమైన వారి ఆలోచనలని మారుస్తాయి..!! స్వంతంగా ఆలోచించలేని సంత గొర్రెలు, గెలిపించి సన్మానం చేసి గెలిపించేది కసాయివాడినే..!! ప్రతి చరిత్ర చెప్పే పాత పాఠం, కష్టాలు పడితేనే నేర్చుకోగలం కొత్త పాఠం అని..!! కొత్త తలనొప్పులని సృష్టించని కాలమేది, కాలాన్ని నిందించని తరమేది..?? తలనొప్పి లేకుండా తలకెక్కించుకోలేముగా, తరాలు మారినా చెదరకుండా కదులుతున్న కాలం నేర్పే పాఠం..!! తరాలు మారినా మనల్ని మారుస్తూ కదిలిపోయేది కాలం అయితే, చరిత్రలని చదువుకుంటూ వస్తున్నా మంచిని చెవికెక్కించుకోలేనిదే సమాజం..!!  అలవాటు పడిపోయిన పాత రోత కంటే, ఆకర్షించడం తెలియని కొత్త ఎప్పుడూ లోకువే..!! అబద్దానికి ఉన్నంత ఆకర్షణ నిజాన

నీ జ్ఞాపకాలు

 మర్చిపోగలనా నీ కోసం నేను పడ్డ తపన, గుర్తుచేసుకోకుండా ఉండగలనా నువ్వు నాతో లేవనే ఆలోచన..!! కాలక్షేపం అనుకున్నావో, కాలయాపన అనుకున్నవో, మన బంధాన్ని గతానికి వదిలేసి, సముద్రాలు దాటి గాలిలో వెళ్ళిపోయావు, నన్ను నీ జ్ఞాపకాల సముద్రంలో వదిలేసిపోయావు..!! ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకుంటుంటే పిచ్చి పట్టిందనుకున్నారు, కన్నీళ్ళు ఇంకిపోయి నవ్వుతుంటే పిచ్చి ముదిరిందనుకున్నారు, కన్నీళ్ళు ఇంకిపోయాక తెలిసింది నువ్విక రావని, కన్నీళ్ళతో పాటు నీ మీదున్న ప్రేమ వదిలిపోలేదని..!! నీతోనే జీవితం అని నేననుకున్నా, నేను లేకుంటేనే జీవితం అని నువ్వనుకున్నావు..!! నాది నువ్వు తప్ప వేరే ఆలోచన లేని ప్రేమ, నీది నాతో భవిష్యత్తుని ఊహించుకుని వదిలేసిన ప్రేమ..!! నన్ను వదిలేసిపోయిన నీది తప్పు కాదు, నీ ఆలోచనల్ని వదులుకోలేని నాదే తప్పు..!! - మీ సత్య

నేను, నా ఆలోచనలు

 కాలానికి నా కష్టం పట్టదు, అదృష్టానికి నా అవసరం ఉండదు..!! సంతోషం కోసం సర్దుకోగలం కానీ, కష్టపడానికి ఇష్టపడలేని మనుషులం..!! కష్టానికి మాత్రమే విలువుంటే కర్షకుడికి ఇన్ని కష్టాలెందుకో, కొన్నిసార్లు కష్టానికి అదృష్టం తోడు కూడా కావాలేమో..!! ఉషోదయం ఎరుగని బ్రతుకైపోతుంది నాది, గది దాటి కదలలేని కలలైపోతున్నాయి నావి..!! కోరుకున్నది దరిచేరనందుకు కాలాన్ని నిందిస్తున్నాను, కోరుకున్నదాని గురించి కవిత్వం రాసి సంబరపడిపోతున్నాను..!! నా కలలు నన్ను బ్రతికించే ఊపిర్లు అయితే, కష్టపడలేక నేను చెప్పుకునే కారణాలు నాకున్న రోగాలు..!! నన్ను నిత్యం నిందించేది నా మనసు, నేను నిందించడానికే దొరికింది నాకు వెళ్లిపోయిన వయసు..!! నా మనసులోని ఆలోచనలకి అంతం లేనట్లే, నా అలోచనల్లోని ప్రశ్నలకి సమాధానం లేదు..!! సమాధానం వెతకలేని అజ్ఞానిని కాదు కానీ, సంజాయిషీ కోసం వెతుక్కుంటూ బ్రతికేస్తున్న మూర్ఖుడ్ని..!! - సత్య