ఇది నా దేశం, ఇందులో
కొట్టుకుచావడానికి, తక్కువచేసి చూడటానికి కులాలు,
మారణహోమాలకి కారణాలుగా చెప్పుకోడానికి మతాలు..!!
ఓపిక, సహనాన్ని మర్చిపోతున్న ప్రజలు,
ఓపిగ్గా దోచుకుంటున్న రాజకీయ నాయకులు..!!
అర్థంలేని ఆవేశాలు, ఆలోచనలేని అనుసరణలు,
మంచిని అపార్థం చేసుకునే అమాయకులు,
అమాయకులని బాగా అధ్యయనం చేసిన రాజకీయనాయకులు..!!
ఐదేళ్ళకొకసారి ఆలోచించుకోవడానికి ఎన్నికలు,
ఎన్నికల్లో అమ్ముకోవడానికి విలువైన ఓట్లు..!!
విజయం లేని మంచివాళ్ళు,
గెలుపుగర్వంతో విర్రవీగే అవినీతిపరులు..!!
క్షణ క్షణం మారిపోయే పరిస్థితులు,
ప్రతిక్షణం ప్రస్తుతాన్ని వాటితో పోల్చుకునే సామాన్యులు..!!
పరిగెత్తలేక అలసిపోయి ఆగిపోతున్న ఆశావహులు,
దురాశతో ఎంత దూరానికైనా వెనకాడని దుర్మార్గులు..!!
కాలం కూడా సమాధానం చెప్పలేని అకృత్యాలు,
కన్నీరుగా కనుల నుండి జారిపోయే యువకుల కలలు,
అవినీతికి, అవకాశావాదానికి ఆవిరైపోయే ఆశలు..!!
కారణం తెలియని కష్టాలకి అలవాటుపడిపోయిన పేదవాళ్ళు,
అనుకున్నట్లు బ్రతికితే చాలనుకుంటూ ఆలోచించడం ఆపేసిన మేధావులు..!!
తమది దరిద్రం కానందుకు సంతోషించే ధనవంతులు,
ఆ జాబితాలో చేరాలని కష్టపడి కాలిపోయే మధ్యతరగతి వాళ్ళు..!!
ఆగిపోమని చెప్పే అధ్వాన్నమైన పరిస్థితులు,
ఆగిపోదామనే అలోచనకే బయటికొచ్చేసే కన్నీళ్ళు..!!
గుర్తుకొచ్చి గుచ్చిపోయే గతంలోని ఆశయాలు,
గతాన్ని వదిలేస్తేనే గమనమంటూ చెప్పే పవిత్ర గ్రంధాలు..!!
- సత్య
Superbb ✨❤️🙏
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteAwesome Is A Small Word To Express How I Feel It while Reading, Thanks Sathya Garu.
ReplyDeleteThank you sir.
DeleteBavundi satya
ReplyDeleteSuper Bro 👏
ReplyDelete👏👏👏👏👏
ReplyDelete👌👌👌🙏🙏🙏❤️👍👍
ReplyDelete