Skip to main content

నేను, నా ఆలోచనలు

 కాలానికి నా కష్టం పట్టదు,
అదృష్టానికి నా అవసరం ఉండదు..!!

సంతోషం కోసం సర్దుకోగలం కానీ,
కష్టపడానికి ఇష్టపడలేని మనుషులం..!!

కష్టానికి మాత్రమే విలువుంటే కర్షకుడికి ఇన్ని కష్టాలెందుకో,
కొన్నిసార్లు కష్టానికి అదృష్టం తోడు కూడా కావాలేమో..!!

ఉషోదయం ఎరుగని బ్రతుకైపోతుంది నాది,
గది దాటి కదలలేని కలలైపోతున్నాయి నావి..!!

కోరుకున్నది దరిచేరనందుకు కాలాన్ని నిందిస్తున్నాను,
కోరుకున్నదాని గురించి కవిత్వం రాసి సంబరపడిపోతున్నాను..!!

నా కలలు నన్ను బ్రతికించే ఊపిర్లు అయితే,
కష్టపడలేక నేను చెప్పుకునే కారణాలు నాకున్న రోగాలు..!!

నన్ను నిత్యం నిందించేది నా మనసు,
నేను నిందించడానికే దొరికింది నాకు వెళ్లిపోయిన వయసు..!!

నా మనసులోని ఆలోచనలకి అంతం లేనట్లే,
నా అలోచనల్లోని ప్రశ్నలకి సమాధానం లేదు..!!

సమాధానం వెతకలేని అజ్ఞానిని కాదు కానీ,
సంజాయిషీ కోసం వెతుక్కుంటూ బ్రతికేస్తున్న మూర్ఖుడ్ని..!!

- సత్య




Comments

  1. అద్భుతం 👌 సోదరా 🙏

    ReplyDelete
  2. కష్టానికి మాత్రమే విలువుంటే కర్షకుడికి ఇన్ని కష్టాలెందుకో,
    కొన్నిసార్లు కష్టానికి అదృష్టం తోడు కూడా కావాలేమో..!! ✍👌 it's truth ♥

    ReplyDelete
  3. Nee kavithalo nanu nenu chusukunattu undi brother...thank you for writing this...chala chala baga raasaru....All the best for future writings...

    ReplyDelete
  4. ఎంతో మనోవేదన అనుభవిస్తే గాని ఇటువంటి కావ్యాలు, కవ్యరుపం దల్చలేవు సార్ ఈ మీ బలమైన, పదునైన మాటలు నాలాంటి ఎంతో మందికి స్ఫూర్తి సార్

    ReplyDelete
  5. కాలానికి అదృష్టం వ్యక్తీకరణం
    సంతోషంగా కష్టపడటం మనస్తత్వం
    కష్టానికి కొన్నిసార్లు ప్రతిఫలం
    ఉషోదయం గది దాటితే నిష్క్రమణం
    కోరుకున్నది కోరుకున్నంత లోకం
    నా కలలు కష్టపడలేని వ్యసనం
    నన్ను నేను నిందించటం
    నా నా లోపం
    సమాధానం సంజాయిషీ అపకారం!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

నిద్రలేని రాత్రుల్లో కలిగిన ఆలోచనలు.

ఏ కాలంలో అయినా కష్టానికి సరైన గుర్తింపు ఉంటుందో లేదో తెలియదు కానీ, విజయానికి మాత్రం మంచి విలువ ఉంటుంది..!! కష్టాన్ని గుర్తించలేని సమాజంలో విజయంతోనే విలువ కట్టే సమాజంలో కన్నీళ్ళకి విలువ ఉండదు..!! అవినీతికి అలవాటు పడిపోయిన ప్రజలు, ఆరోపణలున్న రాజకీయనాయకులని మాత్రం వదులుకుంటారా?? మంచిని అర్థం చేసుకోలేని ప్రజలు, అర్థంచేసుకోడానికి ఆలోచించాల్సిన మంచిని అక్కున చేర్చుకోగలరా?? బలమైన ఆలోచనల్లోంచే పుట్టిన అభిప్రాయాలే, బలహీనమైన వారి ఆలోచనలని మారుస్తాయి..!! స్వంతంగా ఆలోచించలేని సంత గొర్రెలు, గెలిపించి సన్మానం చేసి గెలిపించేది కసాయివాడినే..!! ప్రతి చరిత్ర చెప్పే పాత పాఠం, కష్టాలు పడితేనే నేర్చుకోగలం కొత్త పాఠం అని..!! కొత్త తలనొప్పులని సృష్టించని కాలమేది, కాలాన్ని నిందించని తరమేది..?? తలనొప్పి లేకుండా తలకెక్కించుకోలేముగా, తరాలు మారినా చెదరకుండా కదులుతున్న కాలం నేర్పే పాఠం..!! తరాలు మారినా మనల్ని మారుస్తూ కదిలిపోయేది కాలం అయితే, చరిత్రలని చదువుకుంటూ వస్తున్నా మంచిని చెవికెక్కించుకోలేనిదే సమాజం..!!  అలవాటు పడిపోయిన పాత రోత కంటే, ఆకర్షించడం తెలియని కొత్త ఎప్పుడూ లోకువే..!! అబద్దానికి ఉన్నంత ఆకర్షణ నిజాన

నీ జ్ఞాపకాలు

 మర్చిపోగలనా నీ కోసం నేను పడ్డ తపన, గుర్తుచేసుకోకుండా ఉండగలనా నువ్వు నాతో లేవనే ఆలోచన..!! కాలక్షేపం అనుకున్నావో, కాలయాపన అనుకున్నవో, మన బంధాన్ని గతానికి వదిలేసి, సముద్రాలు దాటి గాలిలో వెళ్ళిపోయావు, నన్ను నీ జ్ఞాపకాల సముద్రంలో వదిలేసిపోయావు..!! ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకుంటుంటే పిచ్చి పట్టిందనుకున్నారు, కన్నీళ్ళు ఇంకిపోయి నవ్వుతుంటే పిచ్చి ముదిరిందనుకున్నారు, కన్నీళ్ళు ఇంకిపోయాక తెలిసింది నువ్విక రావని, కన్నీళ్ళతో పాటు నీ మీదున్న ప్రేమ వదిలిపోలేదని..!! నీతోనే జీవితం అని నేననుకున్నా, నేను లేకుంటేనే జీవితం అని నువ్వనుకున్నావు..!! నాది నువ్వు తప్ప వేరే ఆలోచన లేని ప్రేమ, నీది నాతో భవిష్యత్తుని ఊహించుకుని వదిలేసిన ప్రేమ..!! నన్ను వదిలేసిపోయిన నీది తప్పు కాదు, నీ ఆలోచనల్ని వదులుకోలేని నాదే తప్పు..!! - మీ సత్య