మంచి ఎదగడానికి,
చెడుని తుంచడానికి,
తోడ్పడలేకపోతున్నాననే ఆవేదన..!!
అనుమానం కలిగినా,
అవమానం అనే భయంతో,
మూసధోరణిలోనే పయనిస్తున్నాని ఆవేదన..!!
ప్రయత్నించకుండానే పరాజయానికి,
గెలవకుండానే భాద్యతల భారానికి,
భయపడిపోతున్నానని ఆవేదన..!!
నా కోసం కష్టపడిన వాళ్ళకి,
నన్ను ఇష్టపడుతున్న వాళ్ళకి,
ఇద్దరికీ ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నానని ఆవేదన..!!
చేసేది తప్పని తెలిసినా,
తప్పక చేస్తున్న తప్పని
సర్దుకుపోతున్నందుకు ఆవేదన..!!
నా మీద నాకున్న అనుమానంతో,
సమాజం మీదున్న భయంతో,
మంచికి తోడుగా నిలబడలకేపోతున్నాని ఆవేదన..!!
- సత్య
Comments
Post a Comment