ఆశీర్వదించు నాన్నా,
మీ ఆనందం కోసం అబద్ధం చెప్తున్న నాకు నిన్ను సంతోషపెట్టే నిజం చెప్పే సందర్భం కావాలి,
మీ కలల్ని నా కళ్ళతో కని నిజం చేయగలిగే సామర్థ్యం కావాలి,
ఆనందంగా ఉన్న మీ కళ్ళల్లోకి చూసి నా గుండె సంతోషంతో నిండిపోయి కళ్ళనించి పొంగిపోవాలి,
మనందరి సంతోషం కోసం కష్టపడి అలసిపోయినప్పుడు నీ కళ్ళల్లో కనబడే సంతోషాన్ని అనుభవించే అవకాశం నాకు కలగాలి,
నీ అభిప్రాయాలతో విభేదించేంత ధైర్యం నాకు కలగాలి,
మా భాద్యతల్ని మోస్తున్న భుజాలకి విరామం రావాలి,
నీ మనవళ్ళు మనవరాళ్ళ వినోదానికి అవి కారణమవ్వాలి,
సంతోషంలో ఉన్న మనల్ని పలకరించే కష్టాలని నేను ఎదుర్కోగలననే నమ్మకం మీకు కలగాలి,
ఆ భవిష్యత్తు కోసమే నా ప్రస్తుత ప్రయత్నం,
ఆ ఆనందం కోసమే నా నిరంతర తాపత్రయం..!!
మర్చిపోగలనా నీ కోసం నేను పడ్డ తపన, గుర్తుచేసుకోకుండా ఉండగలనా నువ్వు నాతో లేవనే ఆలోచన..!! కాలక్షేపం అనుకున్నావో, కాలయాపన అనుకున్నవో, మన బంధాన్ని గతానికి వదిలేసి, సముద్రాలు దాటి గాలిలో వెళ్ళిపోయావు, నన్ను నీ జ్ఞాపకాల సముద్రంలో వదిలేసిపోయావు..!! ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకుంటుంటే పిచ్చి పట్టిందనుకున్నారు, కన్నీళ్ళు ఇంకిపోయి నవ్వుతుంటే పిచ్చి ముదిరిందనుకున్నారు, కన్నీళ్ళు ఇంకిపోయాక తెలిసింది నువ్విక రావని, కన్నీళ్ళతో పాటు నీ మీదున్న ప్రేమ వదిలిపోలేదని..!! నీతోనే జీవితం అని నేననుకున్నా, నేను లేకుంటేనే జీవితం అని నువ్వనుకున్నావు..!! నాది నువ్వు తప్ప వేరే ఆలోచన లేని ప్రేమ, నీది నాతో భవిష్యత్తుని ఊహించుకుని వదిలేసిన ప్రేమ..!! నన్ను వదిలేసిపోయిన నీది తప్పు కాదు, నీ ఆలోచనల్ని వదులుకోలేని నాదే తప్పు..!! - మీ సత్య
❤️❤️❤️
ReplyDelete