Skip to main content

రెండవ వ్యాసం

                                     మనిషిగా పుట్టినందుకు, సమాజంలో ఒకడిగా ఆ సమాజపు నియమాలకు లోబడై జీవించడం అనేది తప్పనసరి అయిన విషయం. కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాల్సినవి కాబట్టి పాటిస్తాం, మరికొన్ని మనకు తెలియకుండానే అందరూ పాటిస్తున్నారని అనుసరించేస్తాం. ప్రతి ఒక్కరికి జీవితంలో చాలా సందర్భాల్లో కుటుంబం చేయలేని సాయం అవసరం అవుతుంది. ఆ సాయం సమాజం నుండి నువ్వు పొందాలంటే మనం కూడా సమాజంలో భాగమే అని ఆ సమాజంలో ఉన్నవారందరికీ ఎప్పుడూ, లేదా కనీసం అప్పుడప్పుడు అయినా గుర్తు చేస్తూ ఉండాలి.

                                       తమకి నచ్చకపోయినా సమాజానికి నచ్చినట్లుగా జీవించలేక నటిస్తూ నలిగిపోయేవారు ఎంతోమంది. కనీసం సమాజంతో అవసరం లేకుండా, తనకు నచ్చినట్లు బ్రతికే స్థాయికి సమయం పడుతుంది. ఆ సమయంలో అయినా నటించక తప్పదు. అందరూ ఆ బంధనాల నుండి తప్పించుకోవాలని జీవితంలో పోరాడేవారే. అయితే కొంతమందికి కుటుంబరీత్యానో, పరిస్థితుల దృష్ట్యానో కష్టపడడం అలవాటు అయి తొందరగా సమాజాన్ని శాసించే స్థాయికి ఎదుగుతారు. కొంతమందికి ఆ స్థాయికి ఎదగాలని ఉన్నా, పరిస్థితుల ప్రభావం వలనో సరైన ప్రయత్నం లేకపోవడం వలనో అనుకున్న స్థాయికి వెళ్ళలేక ఉన్న స్థాయి లో బ్రతకలేక నలిగిపోతూ పైకి నవ్వు నటించే వారే ఎక్కువ మంది. సమాజం అంటే కొందరికి నచ్చినట్లు అందరు బ్రతకడెమెమో అని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది.

                                                                    మనకి తెలియకుండానే మనం రోజూ చేసే పనులు, మనం తీసుకునే ఎన్నో కీలకమైన ఎన్నో నిర్ణయాలు ఆ సమాజం ప్రభావితం చేసినవే అయ్యి ఉంటాయి. దీనికి సరైన ఉదాహారణ ఎన్నికలు. కొంతమంది తమకు ఇష్టం లేకపోయినా తమ కుటుంబ సభ్యులు ఎప్పటి నుంచో వేస్తున్నారని ఒకే పార్టీకి ఓట్లు వేస్తారు. కొంతమంది అయితే వ్యక్తి గురించి అసలు పట్టించుకోరు, ఎక్కువ మంది అనుకుంటున్నారని ఒక వ్యక్తికి ఓట్లేస్తారు. వీరిలో ఎవ్వరిని మీది తప్పు అని నిందించకూడదు. వంశ పారంపర్యంగా ఓట్లేసే వారిని మీరు చేసేది తప్పు అంటే అది వారిని మాత్రమే కాదు ఎంతో కాలం నుండి ఓట్లేస్తున్న వారి కుటుంబ సభ్యులని కూడా నిందించినట్లు. అందుకే చాలా మంది గుడ్డిగా ఒక వ్యక్తి గురించి సరైన అవగాహన లేకపోయినా ఆ వ్యక్తికి వోటేసేసి వారి నిర్ణయాన్ని గట్టిగా నమ్మేసి తప్పు అన్న వారిపై తిరగబడతారు. తాము తీసుకున్నది సరైన నిర్ణయమే అని నిందించిన వారు ఒప్పుకునేనంత వరకూ అన్ని విధాలా వాదిస్తూనే ఉంటారు.

                            ఇలాంటి వారితో వాదించడం వ్యర్థం అని నా అభిప్రాయం. వారికి వారుగా తెలుసుకొని మారితే తప్ప మనం వారి ఆలోచనా విధానాన్ని మార్చలేము. మరికొంతమంది మాత్రం ఎక్కువమంది ఎవరికి ఓట్లేద్దాం అని అనుకుంటున్నారో వారికే ఓట్లేస్తారు. ఈ ఆలోచనా విధానాన్ని రాజకీయనాయకులు తమకి అనుకూలంగా మార్చుకొని ప్రజలని ప్రభావితం చేసేలా మాట్లాడి, మాయ చేసి అధికారం చేజిక్కించుకుంటున్నారు. వీరందరి ఆలోచనా విధానాన్ని మార్చడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే ఎంతైనా మనుషులం కదా, మనకి గర్వం ఎక్కువ. ఎవడో చెప్తే విని చేస్తే చెప్పినోడు గొప్ప అని ఒప్పుకున్నట్లు భావించే వారు ఎక్కువమంది. చాల వారకు మనలో ఎవరూ వేరొకరు గొప్ప అని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. మళ్ళీ రాజకీయ నాయకులు చెప్పిన మాటలు విని ఓట్లేసి గెలిపించినప్పుడు ఈ అహం అడ్డు రాదు అనుకుంట. ఎందుకంటే ఒక మనిషి గొప్పోడు అని అందరూ ఒప్పుకుంటేనే వాడు గొప్పోడు. మనతో పాటు తిరిగి మనకి మంచి చెప్పినోడు మనకంటే గొప్పోడు అని ఒప్పుకోవాల్సి వస్తుందని భావంతో చెప్పిన మంచిని కూడా పెడచెవిన పెడుతున్నారు.

వీరి భావజాలాన్ని మార్చి ఎవరికి వారే గొప్పవారు అనే భావన్ కలిగించాలనే ఆలోచన అధికారంలో ఉన్న అవినీతి రాజకీయ నాయకులకి ఉండదు. ఎందుకంటే వాళ్ళ భావజాలం మారితే తమకే అధికారం ఉండదు అనే విషయం వారికి తెలుసు. అందుకే ఎప్పటికి వారిని అలా తాయిలాలు ఇచ్చి బానిసలుగా బ్రతకనిస్తారే తప్పు, వారి బ్రతుకులు బాగు చేసుకునే విధంగా ఎదగడానికి ఎటువంటి చర్యలు తీసుకోరు. ఇది ఎన్నో ఏళ్ళ నుండి మనలో పాతుకుపోయి, మనతో కలిసి జీవనం సాగిస్తూ, మనతో పోటిపడి ఎదుగుతున్న ఒక చీడపురుగు. ఈ చీడపురుగుని ఒకే రోజులో తొలగించలేము. ఒకొక్కరిగా అందరూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒకారు సమానమే, ఏ ఒకారు గొప్పవారు కాదు అనే భావం కలిగిన నాడే మార్పు సాధ్యం. అంతవరకూ సమాజాన్ని అడ్డుగా పెట్టుకొని మనల్ని ప్రభావితం చేసి పబ్బం గడుపుకోవాలనుకునే రాజకీయ నాయకుల కుట్రలని గమనిస్తూ వారి వలలో పడకుండా జాగ్రత్త పడుతూ ముందుకు సాగుతూ ఆశించిన మార్పుకై ఎదురుచూడడం ఒక్కటే మనం చేయగలిగింది.

Note: పైవన్నీ కేవలం నా అభిప్రాయాలు మాత్రమే..!!

Comments

Popular posts from this blog

నిద్రలేని రాత్రుల్లో కలిగిన ఆలోచనలు.

ఏ కాలంలో అయినా కష్టానికి సరైన గుర్తింపు ఉంటుందో లేదో తెలియదు కానీ, విజయానికి మాత్రం మంచి విలువ ఉంటుంది..!! కష్టాన్ని గుర్తించలేని సమాజంలో విజయంతోనే విలువ కట్టే సమాజంలో కన్నీళ్ళకి విలువ ఉండదు..!! అవినీతికి అలవాటు పడిపోయిన ప్రజలు, ఆరోపణలున్న రాజకీయనాయకులని మాత్రం వదులుకుంటారా?? మంచిని అర్థం చేసుకోలేని ప్రజలు, అర్థంచేసుకోడానికి ఆలోచించాల్సిన మంచిని అక్కున చేర్చుకోగలరా?? బలమైన ఆలోచనల్లోంచే పుట్టిన అభిప్రాయాలే, బలహీనమైన వారి ఆలోచనలని మారుస్తాయి..!! స్వంతంగా ఆలోచించలేని సంత గొర్రెలు, గెలిపించి సన్మానం చేసి గెలిపించేది కసాయివాడినే..!! ప్రతి చరిత్ర చెప్పే పాత పాఠం, కష్టాలు పడితేనే నేర్చుకోగలం కొత్త పాఠం అని..!! కొత్త తలనొప్పులని సృష్టించని కాలమేది, కాలాన్ని నిందించని తరమేది..?? తలనొప్పి లేకుండా తలకెక్కించుకోలేముగా, తరాలు మారినా చెదరకుండా కదులుతున్న కాలం నేర్పే పాఠం..!! తరాలు మారినా మనల్ని మారుస్తూ కదిలిపోయేది కాలం అయితే, చరిత్రలని చదువుకుంటూ వస్తున్నా మంచిని చెవికెక్కించుకోలేనిదే సమాజం..!!  అలవాటు పడిపోయిన పాత రోత కంటే, ఆకర్షించడం తెలియని కొత్త ఎప్పుడూ లోకువే..!! అబద్దానికి ఉన్నంత ఆకర్షణ నిజాన

నీ జ్ఞాపకాలు

 మర్చిపోగలనా నీ కోసం నేను పడ్డ తపన, గుర్తుచేసుకోకుండా ఉండగలనా నువ్వు నాతో లేవనే ఆలోచన..!! కాలక్షేపం అనుకున్నావో, కాలయాపన అనుకున్నవో, మన బంధాన్ని గతానికి వదిలేసి, సముద్రాలు దాటి గాలిలో వెళ్ళిపోయావు, నన్ను నీ జ్ఞాపకాల సముద్రంలో వదిలేసిపోయావు..!! ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకుంటుంటే పిచ్చి పట్టిందనుకున్నారు, కన్నీళ్ళు ఇంకిపోయి నవ్వుతుంటే పిచ్చి ముదిరిందనుకున్నారు, కన్నీళ్ళు ఇంకిపోయాక తెలిసింది నువ్విక రావని, కన్నీళ్ళతో పాటు నీ మీదున్న ప్రేమ వదిలిపోలేదని..!! నీతోనే జీవితం అని నేననుకున్నా, నేను లేకుంటేనే జీవితం అని నువ్వనుకున్నావు..!! నాది నువ్వు తప్ప వేరే ఆలోచన లేని ప్రేమ, నీది నాతో భవిష్యత్తుని ఊహించుకుని వదిలేసిన ప్రేమ..!! నన్ను వదిలేసిపోయిన నీది తప్పు కాదు, నీ ఆలోచనల్ని వదులుకోలేని నాదే తప్పు..!! - మీ సత్య

నేను, నా ఆలోచనలు

 కాలానికి నా కష్టం పట్టదు, అదృష్టానికి నా అవసరం ఉండదు..!! సంతోషం కోసం సర్దుకోగలం కానీ, కష్టపడానికి ఇష్టపడలేని మనుషులం..!! కష్టానికి మాత్రమే విలువుంటే కర్షకుడికి ఇన్ని కష్టాలెందుకో, కొన్నిసార్లు కష్టానికి అదృష్టం తోడు కూడా కావాలేమో..!! ఉషోదయం ఎరుగని బ్రతుకైపోతుంది నాది, గది దాటి కదలలేని కలలైపోతున్నాయి నావి..!! కోరుకున్నది దరిచేరనందుకు కాలాన్ని నిందిస్తున్నాను, కోరుకున్నదాని గురించి కవిత్వం రాసి సంబరపడిపోతున్నాను..!! నా కలలు నన్ను బ్రతికించే ఊపిర్లు అయితే, కష్టపడలేక నేను చెప్పుకునే కారణాలు నాకున్న రోగాలు..!! నన్ను నిత్యం నిందించేది నా మనసు, నేను నిందించడానికే దొరికింది నాకు వెళ్లిపోయిన వయసు..!! నా మనసులోని ఆలోచనలకి అంతం లేనట్లే, నా అలోచనల్లోని ప్రశ్నలకి సమాధానం లేదు..!! సమాధానం వెతకలేని అజ్ఞానిని కాదు కానీ, సంజాయిషీ కోసం వెతుక్కుంటూ బ్రతికేస్తున్న మూర్ఖుడ్ని..!! - సత్య