Skip to main content

అవినీతి

అవినీతి, మన ప్రజల రోజువారీ జీవితాల్లో అది కూడా భాగమైపోయింది. మరీ పుస్తకంలో రాసింది రాసినట్లు ప్రతిదానిని అనుసరించడానికి ఎవరికీ సాధ్యం కావడం లేదు. సామాన్యుడికి సమయం లేదు, అధికారుల ఆశకి అంతు లేదు. ఈ రెండింటిని తృప్తి పరిచేది ఒక్క అవినీతి మాత్రమే. అన్ని సక్రమంగా ఉన్నా ఎంతో కొంత ముట్టజెప్పాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఎంతో ప్రయాస పడి అన్ని సక్రమంగా చేయాలేనే భావన సగటు సామాన్యుడిలో కూడా ఉంది.

పోనీ అవినీతిని ఎదిరించి పని చేసుకుందామంటే పని జరగదు. ఫిర్యాదు చేసినా సత్వరంగా న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు.  వీటన్నింటి వలన అవినీతి అనేది అన్ని చోట్లా పెరిగిపోతుంది. ఒకరిద్దరు నీతిగా పనిచేస్తున్నా ఆ ఒకరిద్దరంటే మిగిలిన అధికారులకి భయం పెరిగిపోయి, మిగిలిన వారందరూ వారికి వ్యతిరేకం అయిపోయి పని చేయడం కష్టతరం చేసేస్తారు. ఇలా కష్టాలు ఎదురైనప్పుడు తమ ముందుండేవి రెండే దారులు. ఒకటి తాము నమ్ముకున్న సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేయలేక ఉద్యోగం మానేయడం, లేదా నచ్చకపోయినా సిద్ధాంతాలను పక్కనబెట్టి అవినీతి మార్గాన్ని ఎంచుకోవడం. మొదటిది అందరూ చేయలేరు. తన మీద ఆధారపడి ఉన్న కుటుంబాన్ని పోషించాల్సిన భాద్యత వారిపై ఉంటుంది. ఈ ఉద్యోగం మానేసి వారిని భాదపెట్టలేక, నమ్మిన సిధ్ధాంతాలకు న్యాయం చేయలేక ఎంతో మంది మారిపోతున్నారు. ఇలాంటి వారు అవకాశం వస్తే తప్ప అవినీతి చేయరు. ఎందుకంటే వారిని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది అని నా అభిప్రాయం.

వీటన్నింటికి నాకు తెలిసినంతవరకు ఒకటే పరిష్కారం. అవినీతిని ఎదిరంచి నిలబడిన వారికి తోడుగా నిలబడేంతలా సమాజం పురోగతి చెందాలి. అలా జరగాలంటే ప్రభుత్వాలు అవినీతిపై పోరాటం చేసేవారికి అండగా నిలబడతాం అనే ధైర్యం కలిగించాలి. ఇటువంటి కేసుల్లో విచారణ శిక్ష త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. అవినీతి చేయాలనుకునే అధికారుల్లో అవినీతిని ప్రోత్సహించే ప్రజలలో భయం పెరగాలి. మంచి మాటలు విని మారిపోయే స్థితిని మనమెప్పుడో దాటిపోయాం అనేది నా అభిప్రాయం.

ఈ అవినీతి కొంతమంది రాజకీయనాయకులకి చాలా అవసరం. ఎందుకంటే వీరి జేబులు నిండేది ఇలా అవినీతి జరిగినప్పుడే. అందుకే మంచి ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చిన వారిని ఎలాగైన ప్రజల దృష్టిలో వచ్చిన వారు కూడా అందరూ లాంటి వారే అనే అబద్దపు భావన కలిగేలా చేస్తారు. కొత్తగా వచ్చిన వాడి దగ్గర గుండు కొట్టించుకోవడం కంటే మనకి తెలిసిన వాడు, ఎప్పటినుంచో వున్న వాడైతే మనకు మంచిదని ప్రజలు కూడా ఆలోచించి వారికే ఓట్లేసి అందలమెక్కిస్తున్నారు, అవినీతిలో బ్రతికేస్తున్నారు.

అలా అవినీతిలో అందరిలాగే బ్రతికేస్తున్నాము అనుకుంటున్నారు కానీ, ఈ సమాజంలో కొందరు ఎదిగినట్లు మనం ఎందుకు ఎదగలేకపోతున్నాము అని ఆలోచిస్తున్నారు. కానీ దానికి కారణం తామే అనే నిజాన్ని మాత్రం ఒప్పుకోలేకపోతున్నారు. ఇది నిజం..!! బద్దకాన్ని మన నరనరాల్లో నింపేసి వారి ఉచిత పథకాలకి మనల్ని బానిసలుగా చేసుకొని వారు రాజ్యాలనేలుతున్నారు, మనం మాత్రం వారిలా ఉండాలి వీరిలా ఉండాలి అని కలలు కంటూ బ్రతికేస్తున్నాం.
అందరికీ అన్ని కావాలి, కానీ వాటి కోసం కష్టపడడానికి మాత్రం బద్ధకం. అందరికి కష్టపడి పైకి ఎదగడానికి సమానంగా అవకాశాలు ఉండాలి. వారు పడిన కష్టాన్ని బట్టి వారికి ఫలితాలు ఉండాలి. అప్పుడే అది సమసమాజం అవుతుందని నా అభిప్రాయం..!!

పైన వున్నవి కేవలం నా అభిప్రాయాలు  మాత్రమే..!!

Comments

Post a Comment

Popular posts from this blog

నిద్రలేని రాత్రుల్లో కలిగిన ఆలోచనలు.

ఏ కాలంలో అయినా కష్టానికి సరైన గుర్తింపు ఉంటుందో లేదో తెలియదు కానీ, విజయానికి మాత్రం మంచి విలువ ఉంటుంది..!! కష్టాన్ని గుర్తించలేని సమాజంలో విజయంతోనే విలువ కట్టే సమాజంలో కన్నీళ్ళకి విలువ ఉండదు..!! అవినీతికి అలవాటు పడిపోయిన ప్రజలు, ఆరోపణలున్న రాజకీయనాయకులని మాత్రం వదులుకుంటారా?? మంచిని అర్థం చేసుకోలేని ప్రజలు, అర్థంచేసుకోడానికి ఆలోచించాల్సిన మంచిని అక్కున చేర్చుకోగలరా?? బలమైన ఆలోచనల్లోంచే పుట్టిన అభిప్రాయాలే, బలహీనమైన వారి ఆలోచనలని మారుస్తాయి..!! స్వంతంగా ఆలోచించలేని సంత గొర్రెలు, గెలిపించి సన్మానం చేసి గెలిపించేది కసాయివాడినే..!! ప్రతి చరిత్ర చెప్పే పాత పాఠం, కష్టాలు పడితేనే నేర్చుకోగలం కొత్త పాఠం అని..!! కొత్త తలనొప్పులని సృష్టించని కాలమేది, కాలాన్ని నిందించని తరమేది..?? తలనొప్పి లేకుండా తలకెక్కించుకోలేముగా, తరాలు మారినా చెదరకుండా కదులుతున్న కాలం నేర్పే పాఠం..!! తరాలు మారినా మనల్ని మారుస్తూ కదిలిపోయేది కాలం అయితే, చరిత్రలని చదువుకుంటూ వస్తున్నా మంచిని చెవికెక్కించుకోలేనిదే సమాజం..!!  అలవాటు పడిపోయిన పాత రోత కంటే, ఆకర్షించడం తెలియని కొత్త ఎప్పుడూ లోకువే..!! అబద్దానికి ఉన్నంత ఆకర్షణ నిజాన

నీ జ్ఞాపకాలు

 మర్చిపోగలనా నీ కోసం నేను పడ్డ తపన, గుర్తుచేసుకోకుండా ఉండగలనా నువ్వు నాతో లేవనే ఆలోచన..!! కాలక్షేపం అనుకున్నావో, కాలయాపన అనుకున్నవో, మన బంధాన్ని గతానికి వదిలేసి, సముద్రాలు దాటి గాలిలో వెళ్ళిపోయావు, నన్ను నీ జ్ఞాపకాల సముద్రంలో వదిలేసిపోయావు..!! ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకుంటుంటే పిచ్చి పట్టిందనుకున్నారు, కన్నీళ్ళు ఇంకిపోయి నవ్వుతుంటే పిచ్చి ముదిరిందనుకున్నారు, కన్నీళ్ళు ఇంకిపోయాక తెలిసింది నువ్విక రావని, కన్నీళ్ళతో పాటు నీ మీదున్న ప్రేమ వదిలిపోలేదని..!! నీతోనే జీవితం అని నేననుకున్నా, నేను లేకుంటేనే జీవితం అని నువ్వనుకున్నావు..!! నాది నువ్వు తప్ప వేరే ఆలోచన లేని ప్రేమ, నీది నాతో భవిష్యత్తుని ఊహించుకుని వదిలేసిన ప్రేమ..!! నన్ను వదిలేసిపోయిన నీది తప్పు కాదు, నీ ఆలోచనల్ని వదులుకోలేని నాదే తప్పు..!! - మీ సత్య

నేను, నా ఆలోచనలు

 కాలానికి నా కష్టం పట్టదు, అదృష్టానికి నా అవసరం ఉండదు..!! సంతోషం కోసం సర్దుకోగలం కానీ, కష్టపడానికి ఇష్టపడలేని మనుషులం..!! కష్టానికి మాత్రమే విలువుంటే కర్షకుడికి ఇన్ని కష్టాలెందుకో, కొన్నిసార్లు కష్టానికి అదృష్టం తోడు కూడా కావాలేమో..!! ఉషోదయం ఎరుగని బ్రతుకైపోతుంది నాది, గది దాటి కదలలేని కలలైపోతున్నాయి నావి..!! కోరుకున్నది దరిచేరనందుకు కాలాన్ని నిందిస్తున్నాను, కోరుకున్నదాని గురించి కవిత్వం రాసి సంబరపడిపోతున్నాను..!! నా కలలు నన్ను బ్రతికించే ఊపిర్లు అయితే, కష్టపడలేక నేను చెప్పుకునే కారణాలు నాకున్న రోగాలు..!! నన్ను నిత్యం నిందించేది నా మనసు, నేను నిందించడానికే దొరికింది నాకు వెళ్లిపోయిన వయసు..!! నా మనసులోని ఆలోచనలకి అంతం లేనట్లే, నా అలోచనల్లోని ప్రశ్నలకి సమాధానం లేదు..!! సమాధానం వెతకలేని అజ్ఞానిని కాదు కానీ, సంజాయిషీ కోసం వెతుక్కుంటూ బ్రతికేస్తున్న మూర్ఖుడ్ని..!! - సత్య