ఎవ్వరినీ నమ్మొద్దు. నిన్ను నువ్వు నమ్ముకో, నువ్వు నమ్మిన దారిలో మొదటి అడుగు నీదే కావాలి. ఆ దారిలో నీతో పాటు ఎన్నో అడుగులు కలవొచ్చు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవచ్చు, లేదా నువ్వొక్కడివే ఒంటరిగా మిగిలిపోవచ్చు. ఎవర్ని నమ్మలేము. మన జీవితమే మనకి రోజూ ఎన్నో పరీక్షలని పెడుతుంది. అలాంటిది మనతో, మనం నమ్మిన మార్గంలో నడిచే వారి నిజాయితీని, నిబద్ధతని తెలుసుకోవడానికి నువ్వు ఎన్ని పరీక్షలు పెట్టాలి? అన్ని పరీక్షల్లో నెగ్గినా ఆఖరి అడుగు దాకా నీతో కలిసి నడుస్తాడన్న నమ్మకం కలుగుతుందా? నాకైతే కలగదు, నేటి పరిస్థితులని చూసి అస్సలు నమ్మాలంటేనే భయమేస్తుంది. కానీ నమ్మక తప్పదు. నమ్మకంతో సాగాల్సిన ప్రయాణం మనందరి జీవితం. మనం అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఒక్క కాలమే చెప్పగలదు. వేచి చూడడం, అంతవరకూ నమ్మడమే మనం చేయగలం.
అయినా ఎవడో మనల్ని నమ్మించి మోసం చేశాడని భాధపడిపోయి మన ప్రయాణాన్ని ఆపేస్తామా? ఆపేయ్యకూడదు. మనం చేసే పని మీద మనకు నమ్మకం ఉండాలి, మనం చేసే పనిని, ఎంచుకున్న మార్గాన్ని చూసి మన చూట్టూ ఉన్న నలుగురిలో మన మీద నమ్మకం కలగాలి. ఇక్కడ చెడ్డగా మారెంతవరకూ మనలో మంచివారెవరో కాదో ఎవ్వరికీ తెలియదు. తెలియని విషయాలకై ఆలోచించి తల బ్రద్దలు కొట్టుకోవడం కంటే మన మీద మనం నమ్మకం పెంచుకొని ధైర్యంగా మనం నమ్మిన దారిలో ముందుకు సాగిపోవడమే ఉత్తమమం.
ఒక మనిషి చేతిలో ఒక్కసారి మోసపోతే వాడి పనితనం, రెండోసారి కూడా మోసపోతే మన వెర్రితనం అవుతుంది. మంచివాడిగానే మిగిలిపోదాం. మన పని మనం చేసుకుందాం. మనం ఒకర్ని నమ్మొచ్చా అనే ఆలోచనని మానేసి, మనం నలుగురిలో మన మీద నమ్మకం కలిగేలా బ్రతుకుదాం. మోసపోవడం నీ తప్పు కాదు, అదే మనిషి చేతిలో రెండోసారి మోసపోవడం తప్పు, మోసపోయిన వాడి గురించి ఆలోచిస్తూ మనల్ని మనం నాశనం చేసుకోవడం తప్పు. మన చేతిలో ఉండేది మన ప్రవర్తనా విధానం. మన చేతిలో లేని, మనకి తెలియని వేరొకరి ప్రవర్తన గురించి ఆలోచించుకుంటూ ఆగిపోవద్దు.
చివరి మాట: మనల్ని మనం నమ్ముకోవాలి, మనకై మనం బ్రతకాలి, మనం నమ్మిన దాని కోసం బ్రతకాలి. గతంలో జరిగిన మోసం గురించి ఆలోచించాలి కానీ ఆలోచిస్తూ మన బ్రతుకు ప్రయాణాన్ని ఆపెయ్యకూడదు.
ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే.
మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను
ReplyDelete👌
ReplyDeleteindulo vimarsinchadaniki yemiledhu, antha manche chepparu, vimarsa kuda tesukuntaanu anadam mee samskaram...
ReplyDeleteNice words... Fact evaru evarooo entha varaku thodu unttaroo entha varaku ninu vimarshistharoo theliyadhu..... Good bro
ReplyDeleteSuper Satya Anna Garu 🙏👌👏
ReplyDeleteNijamga edhi reality....bro
ReplyDeleteఒక మనిషి చేతిలో ఒక్కసారి మోసపోతే వాడి పనితనం, రెండోసారి కూడా మోసపోతే మన వెర్రితనం అవుతుంది. మంచివాడిగానే మిగిలిపోదాం. మన పని మనం చేసుకుందాం. 😇
ReplyDelete