Skip to main content

ఎవర్ని నమ్మాలి?

                            ఎవ్వరినీ నమ్మొద్దు. నిన్ను నువ్వు నమ్ముకో, నువ్వు నమ్మిన దారిలో మొదటి అడుగు నీదే కావాలి. ఆ దారిలో నీతో పాటు ఎన్నో అడుగులు కలవొచ్చు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవచ్చు, లేదా నువ్వొక్కడివే ఒంటరిగా మిగిలిపోవచ్చు. ఎవర్ని నమ్మలేము. మన జీవితమే మనకి రోజూ ఎన్నో పరీక్షలని పెడుతుంది. అలాంటిది మనతో, మనం నమ్మిన మార్గంలో నడిచే వారి నిజాయితీని, నిబద్ధతని తెలుసుకోవడానికి నువ్వు ఎన్ని పరీక్షలు పెట్టాలి? అన్ని పరీక్షల్లో నెగ్గినా ఆఖరి అడుగు దాకా నీతో కలిసి నడుస్తాడన్న నమ్మకం కలుగుతుందా? నాకైతే కలగదు, నేటి పరిస్థితులని చూసి అస్సలు నమ్మాలంటేనే భయమేస్తుంది. కానీ నమ్మక తప్పదు. నమ్మకంతో సాగాల్సిన ప్రయాణం మనందరి జీవితం. మనం అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఒక్క కాలమే చెప్పగలదు. వేచి చూడడం, అంతవరకూ నమ్మడమే మనం చేయగలం. 

                            అయినా ఎవడో మనల్ని నమ్మించి మోసం చేశాడని భాధపడిపోయి మన ప్రయాణాన్ని ఆపేస్తామా? ఆపేయ్యకూడదు. మనం చేసే పని మీద మనకు నమ్మకం ఉండాలి, మనం చేసే పనిని, ఎంచుకున్న మార్గాన్ని చూసి మన చూట్టూ ఉన్న నలుగురిలో మన మీద నమ్మకం కలగాలి. ఇక్కడ చెడ్డగా మారెంతవరకూ మనలో మంచివారెవరో కాదో ఎవ్వరికీ తెలియదు. తెలియని విషయాలకై ఆలోచించి తల బ్రద్దలు కొట్టుకోవడం కంటే మన మీద మనం నమ్మకం పెంచుకొని ధైర్యంగా మనం నమ్మిన దారిలో ముందుకు సాగిపోవడమే ఉత్తమమం.

                        ఒక మనిషి చేతిలో ఒక్కసారి మోసపోతే వాడి పనితనం, రెండోసారి కూడా మోసపోతే మన వెర్రితనం అవుతుంది. మంచివాడిగానే మిగిలిపోదాం. మన పని మనం చేసుకుందాం. మనం ఒకర్ని నమ్మొచ్చా అనే ఆలోచనని మానేసి, మనం నలుగురిలో మన మీద నమ్మకం కలిగేలా బ్రతుకుదాం. మోసపోవడం నీ తప్పు కాదు, అదే మనిషి చేతిలో రెండోసారి మోసపోవడం తప్పు, మోసపోయిన వాడి గురించి ఆలోచిస్తూ మనల్ని మనం నాశనం చేసుకోవడం తప్పు. మన చేతిలో ఉండేది మన ప్రవర్తనా విధానం. మన చేతిలో లేని, మనకి తెలియని వేరొకరి ప్రవర్తన గురించి ఆలోచించుకుంటూ ఆగిపోవద్దు.

చివరి మాట: మనల్ని మనం నమ్ముకోవాలి, మనకై మనం బ్రతకాలి, మనం నమ్మిన దాని కోసం బ్రతకాలి. గతంలో జరిగిన మోసం గురించి ఆలోచించాలి కానీ ఆలోచిస్తూ మన బ్రతుకు ప్రయాణాన్ని ఆపెయ్యకూడదు.

ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే.

Comments

  1. మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను

    ReplyDelete
  2. indulo vimarsinchadaniki yemiledhu, antha manche chepparu, vimarsa kuda tesukuntaanu anadam mee samskaram...

    ReplyDelete
  3. Nice words... Fact evaru evarooo entha varaku thodu unttaroo entha varaku ninu vimarshistharoo theliyadhu..... Good bro

    ReplyDelete
  4. Super Satya Anna Garu 🙏👌👏

    ReplyDelete
  5. ఒక మనిషి చేతిలో ఒక్కసారి మోసపోతే వాడి పనితనం, రెండోసారి కూడా మోసపోతే మన వెర్రితనం అవుతుంది. మంచివాడిగానే మిగిలిపోదాం. మన పని మనం చేసుకుందాం. 😇

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

నీ జ్ఞాపకాలు

 మర్చిపోగలనా నీ కోసం నేను పడ్డ తపన, గుర్తుచేసుకోకుండా ఉండగలనా నువ్వు నాతో లేవనే ఆలోచన..!! కాలక్షేపం అనుకున్నావో, కాలయాపన అనుకున్నవో, మన బంధాన్ని గతానికి వదిలేసి, సముద్రాలు దాటి గాలిలో వెళ్ళిపోయావు, నన్ను నీ జ్ఞాపకాల సముద్రంలో వదిలేసిపోయావు..!! ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకుంటుంటే పిచ్చి పట్టిందనుకున్నారు, కన్నీళ్ళు ఇంకిపోయి నవ్వుతుంటే పిచ్చి ముదిరిందనుకున్నారు, కన్నీళ్ళు ఇంకిపోయాక తెలిసింది నువ్విక రావని, కన్నీళ్ళతో పాటు నీ మీదున్న ప్రేమ వదిలిపోలేదని..!! నీతోనే జీవితం అని నేననుకున్నా, నేను లేకుంటేనే జీవితం అని నువ్వనుకున్నావు..!! నాది నువ్వు తప్ప వేరే ఆలోచన లేని ప్రేమ, నీది నాతో భవిష్యత్తుని ఊహించుకుని వదిలేసిన ప్రేమ..!! నన్ను వదిలేసిపోయిన నీది తప్పు కాదు, నీ ఆలోచనల్ని వదులుకోలేని నాదే తప్పు..!! - మీ సత్య

నేను, నా ప్రపంచం.

 కదిలిపోయే ఈ రోజుల్లో, కరిగిపోయే కలలు నా సొంతం..!! ముందుకుపోయే కాలంతో ముందడుగు వేయలేనిది నా నైజం..!! నాది ఒక ప్రపంచం, అది నన్ను వదిలిపోతుందేమోనని భయం, అందుకే దానికి చేస్తున్నా ఊడిగం..!! చుట్టూ ఉన్న సమాజం, వెక్కిరిస్తున్నా పట్టించుకోని వెర్రితనం..!! దగ్గరవ్వాలనుకుంటుంటే అదృష్టం, దూరమవ్వనంటుంది బద్దకం..!! అడుగడుగునా ఎదురయ్యే నిర్లిప్తతపై కోపం, అందుకే నిస్సహాయతతో అంతులేని ఆవేశం..!! అసమర్థతని ఒప్పుకోలేక, అదృష్టాన్ని కోరుకోకుండా ఉండలేక, బద్ధకంతో బ్రతికేయడం నా వ్యక్తిత్వం..!! నా ప్రపంచంలో నేను చేరుకోవాలనుకునేది స్వర్గం, నన్ను కోరుకుని వదలలేనిది నరకం..!! నాది ఒక వింత విధానం, దానిలో విజయానికి ఉండదు ఆస్కారం..!! నాకు ఓటమి కలిగితే, ఓదార్చనక్కర్లేనంత అలవాటు, గెలుపు కలిగితే, అది దాని పొరపాటు..!! పొగరు తగ్గించుకోలేనంత బలుపు, అందుకే దూరమవుతూ వెక్కిరిస్తుంది గెలుపు..!! బద్ధకం, కష్టాలకి కారణమని తెలిసినా వదులుకోలేని వ్యసనం, అదృష్టం, ఉండదని తెలిసినా కావాలనుకునే అమాయకత్వం..!! - సత్య

ఆశీర్వదించు నాన్నా!!

ఆశీర్వదించు నాన్నా, మీ ఆనందం కోసం అబద్ధం చెప్తున్న నాకు నిన్ను సంతోషపెట్టే నిజం చెప్పే సందర్భం కావాలి, మీ కలల్ని నా కళ్ళతో కని నిజం చేయగలిగే సామర్థ్యం కావాలి, ఆనందంగా ఉన్న మీ కళ్ళల్లోకి చూసి నా గుండె సంతోషంతో నిండిపోయి కళ్ళనించి పొంగిపోవాలి, మనందరి సంతోషం కోసం కష్టపడి అలసిపోయినప్పుడు నీ కళ్ళల్లో కనబడే సంతోషాన్ని అనుభవించే అవకాశం నాకు కలగాలి, నీ అభిప్రాయాలతో విభేదించేంత ధైర్యం నాకు కలగాలి, మా భాద్యతల్ని మోస్తున్న భుజాలకి విరామం రావాలి, నీ మనవళ్ళు మనవరాళ్ళ వినోదానికి అవి కారణమవ్వాలి, సంతోషంలో ఉన్న మనల్ని పలకరించే కష్టాలని నేను ఎదుర్కోగలననే నమ్మకం మీకు కలగాలి, ఆ భవిష్యత్తు కోసమే నా ప్రస్తుత ప్రయత్నం, ఆ ఆనందం కోసమే నా నిరంతర తాపత్రయం..!!