Skip to main content

నేటి సమాజం

 చెదలు పట్టి చరిత్రలోని వీరగాథలు,

చచ్చిపోతున్నాయి సగటు మనిషిలో ధైర్యసాహసాలు..!!


బ్రతుకంటేనే భారమంటున్నాయి ఆలోచనలు,

చేరుకోలేక నీతిగా ఆశించిన దూరాలు,

అలవాటు పడిపోతున్నాయి అవినీతికి సామాన్య జీవితాలు..!!


చూస్తూ చూస్తూ చుట్టూ మనిషి చేసే మోసాలు,

కనుమరుగయిపోతున్నాయి మనిషిలోని మంచిగుణాలు..!!


ఎటూ జీవనకాలం తగ్గిపోతుందని కాబోలు,

కలిసిపోతున్నాయి గుర్తుపట్టలేనంతగా మనలోని మంచిచెడులు..!!


అమ్ముడుబోవడానికి సిద్ధమైపోతుంటే ప్రజలు,

కనీసం ప్రయత్నిస్తాయా పద్ధతిగా పనిచేయడానికి ప్రభుత్వాలు..!!


విలువ లేదంటూ విజయం లేనివారికి,

దిగజారిపోతావా విజయం సాధించడానికి..!!


సరిపెట్టుకుని బ్రతికేస్తూ ఉంటే మన ప్రాప్తం ఇంతే అని,

దోచుకుంటూనే ఉంటారు నిర్విరామంగా నీ కష్టార్జితాన్ని..!!


ఉన్నప్పుడు నేరుగా నిలదీయలేని భయం,

నిశ్శబ్దంగా ఓటేసి చూపించాలి నీ ధైర్యం..!!


నిజం వైపు నీతిగా నిలబడటమే నిజాయితీ,

ఆలస్యాన్ని భరించలేని అత్యాశతో మొదలయ్యిందే అవినీతి..!!


Comments

  1. చాలా బాగుంది సత్యా. 🙏❤️

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ అన్నయ్య..!

      Delete
  2. విలవ లేదంటూ విజయం లేనివారికి
    ధిగజారిపొతావ విజయం సాధించడాడికి👌👏

    ReplyDelete
  3. ఉన్నప్పుడు నేరుగా నిలదీయలేని భయం,

    నిశ్శబ్దంగా ఓటేసి చూపించాలి నీ ధైర్యం..!!

    బావుంది సత్యా, నిజానికి ఈ మాత్రం చైతన్యం కూడా లేకపోవడం ఆందోళనకరం 😥

    -శ్రీ

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

నీ జ్ఞాపకాలు

 మర్చిపోగలనా నీ కోసం నేను పడ్డ తపన, గుర్తుచేసుకోకుండా ఉండగలనా నువ్వు నాతో లేవనే ఆలోచన..!! కాలక్షేపం అనుకున్నావో, కాలయాపన అనుకున్నవో, మన బంధాన్ని గతానికి వదిలేసి, సముద్రాలు దాటి గాలిలో వెళ్ళిపోయావు, నన్ను నీ జ్ఞాపకాల సముద్రంలో వదిలేసిపోయావు..!! ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకుంటుంటే పిచ్చి పట్టిందనుకున్నారు, కన్నీళ్ళు ఇంకిపోయి నవ్వుతుంటే పిచ్చి ముదిరిందనుకున్నారు, కన్నీళ్ళు ఇంకిపోయాక తెలిసింది నువ్విక రావని, కన్నీళ్ళతో పాటు నీ మీదున్న ప్రేమ వదిలిపోలేదని..!! నీతోనే జీవితం అని నేననుకున్నా, నేను లేకుంటేనే జీవితం అని నువ్వనుకున్నావు..!! నాది నువ్వు తప్ప వేరే ఆలోచన లేని ప్రేమ, నీది నాతో భవిష్యత్తుని ఊహించుకుని వదిలేసిన ప్రేమ..!! నన్ను వదిలేసిపోయిన నీది తప్పు కాదు, నీ ఆలోచనల్ని వదులుకోలేని నాదే తప్పు..!! - మీ సత్య

నేను, నా ప్రపంచం.

 కదిలిపోయే ఈ రోజుల్లో, కరిగిపోయే కలలు నా సొంతం..!! ముందుకుపోయే కాలంతో ముందడుగు వేయలేనిది నా నైజం..!! నాది ఒక ప్రపంచం, అది నన్ను వదిలిపోతుందేమోనని భయం, అందుకే దానికి చేస్తున్నా ఊడిగం..!! చుట్టూ ఉన్న సమాజం, వెక్కిరిస్తున్నా పట్టించుకోని వెర్రితనం..!! దగ్గరవ్వాలనుకుంటుంటే అదృష్టం, దూరమవ్వనంటుంది బద్దకం..!! అడుగడుగునా ఎదురయ్యే నిర్లిప్తతపై కోపం, అందుకే నిస్సహాయతతో అంతులేని ఆవేశం..!! అసమర్థతని ఒప్పుకోలేక, అదృష్టాన్ని కోరుకోకుండా ఉండలేక, బద్ధకంతో బ్రతికేయడం నా వ్యక్తిత్వం..!! నా ప్రపంచంలో నేను చేరుకోవాలనుకునేది స్వర్గం, నన్ను కోరుకుని వదలలేనిది నరకం..!! నాది ఒక వింత విధానం, దానిలో విజయానికి ఉండదు ఆస్కారం..!! నాకు ఓటమి కలిగితే, ఓదార్చనక్కర్లేనంత అలవాటు, గెలుపు కలిగితే, అది దాని పొరపాటు..!! పొగరు తగ్గించుకోలేనంత బలుపు, అందుకే దూరమవుతూ వెక్కిరిస్తుంది గెలుపు..!! బద్ధకం, కష్టాలకి కారణమని తెలిసినా వదులుకోలేని వ్యసనం, అదృష్టం, ఉండదని తెలిసినా కావాలనుకునే అమాయకత్వం..!! - సత్య

ఆశీర్వదించు నాన్నా!!

ఆశీర్వదించు నాన్నా, మీ ఆనందం కోసం అబద్ధం చెప్తున్న నాకు నిన్ను సంతోషపెట్టే నిజం చెప్పే సందర్భం కావాలి, మీ కలల్ని నా కళ్ళతో కని నిజం చేయగలిగే సామర్థ్యం కావాలి, ఆనందంగా ఉన్న మీ కళ్ళల్లోకి చూసి నా గుండె సంతోషంతో నిండిపోయి కళ్ళనించి పొంగిపోవాలి, మనందరి సంతోషం కోసం కష్టపడి అలసిపోయినప్పుడు నీ కళ్ళల్లో కనబడే సంతోషాన్ని అనుభవించే అవకాశం నాకు కలగాలి, నీ అభిప్రాయాలతో విభేదించేంత ధైర్యం నాకు కలగాలి, మా భాద్యతల్ని మోస్తున్న భుజాలకి విరామం రావాలి, నీ మనవళ్ళు మనవరాళ్ళ వినోదానికి అవి కారణమవ్వాలి, సంతోషంలో ఉన్న మనల్ని పలకరించే కష్టాలని నేను ఎదుర్కోగలననే నమ్మకం మీకు కలగాలి, ఆ భవిష్యత్తు కోసమే నా ప్రస్తుత ప్రయత్నం, ఆ ఆనందం కోసమే నా నిరంతర తాపత్రయం..!!